IT Jobs in India : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. లక్షకుపైగా కొత్త ఉద్యోగ అవకాశాలు!

కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగాల కోసం పడుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి మన ఐటీ కంపెనీలు. దేశీయ దిగ్గజ మూడు అతిపెద్ద ఐటీ కంపెనీలు లాభాలతో జోరందుకున్నాయి.

Good News For Unemployed Opportunities : కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగాల కోసం పడుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి మన ఐటీ కంపెనీలు. దేశీయ దిగ్గజ మూడు అతిపెద్ద ఐటీ కంపెనీలు లాభాలతో జోరందుకున్నాయి. ఈ ఏడాదిలో మొదటి త్రైమాసికంలో మెరుగైన ఆర్ధిక ఫలితాలు వచ్చాయి. దాంతో లక్షకు పైగా కొత్త ఉద్యోగాలకు అవకాశాలు కల్పించనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకూ ముగిసిన త్రైమాసికంలో ఐటీ కంపెనీలు TCS, Infosys, Wipro సంస్థలు రూ.17,446 కోట్ల లాభాలను ఆర్జించాయి.

ఈ ఏడాదిలో దాదాపు లక్షా ఐదువేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నాయి. ఐటీ రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) జూన్ త్రైమాసికంలో 9వేల కోట్ల లాభాన్ని ఆర్జించింది. విప్రో సంస్థ మొదటి త్రైమాసిక ఫలితాల్లో అదే జోరు కనిపించింది. గత ఏడాదితో రూ.2,390 కోట్లతో పోలిస్తే రూ. 3,243 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇన్ఫోసిస్ కూడా మొదటి త్రైమాసికంలో రూ .5,195 కోట్లు ఆర్జించింది.

త్రైమాసిక ఫలితాల్లో విప్రో ఆదాయం కూడా జూన్ త్రైమాసికంలో 12శాతం పెరిగి రూ .18,252 కోట్లకు చేరుకుంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ 129 మంది కొత్త కస్టమర్లను తన పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంది. జూలై-సెప్టెంబరులో ఆరువేల మంది ఐటి నిపుణులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. 2021-22లో 30వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇస్తామని విప్రో హామీ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు