HCL Technologies Skill Training! Those who completed Inter are eligible to apply
HCL Technologies : హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ఇంటర్ పూర్తి చేసిన వారికి ఐటీ కొలువులు కల్పించేందుకు హెచ్ సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఎంట్రీ లెవల్ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణను అందిస్తోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
అభ్యర్థుల అర్హతలకు సంబంధించి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అది కూడా 2021, 2022లో ఉత్తీర్ణులై ఉండాలి. 60 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలి.
అభ్యర్ధుల ఎంపికకు హెచ్సీఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించనున్నారు. దీనిలో ప్రతిభ కనబరిచిన వారికి ఇంటర్వ్యూలో కొన్ని ప్రమాణాలను పరిశీలించి. తర్వాత ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. ఫీజు రూ. 2లక్షలు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2లక్షల కంటే తక్కువ ఉన్నవారికి బ్యాంక్ నుంచి లోన్ సౌకర్యం కల్పించనున్నారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని హెచ్ సీఎల్ టెక్నాలజీలో పూర్తికాల ఉద్యోగులుగా నియమించుకుంటారు.
ఎంపికైన అభ్యర్థులను లక్నో, నోయిడా, మధురై, చెన్నై, విజయవాడ , హైదరాబాద్ , బెంగళూరు, నాగపూర్లోని కేంద్రాల్లో శిక్షణ అందిస్తారు. టెక్ బీ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంషిప్ చేసే సమయంలో నెలకు రూ.10 వేలచొప్పున స్టయిపెండ్ చెల్లిస్తారు. పూర్తిస్థాయి ఉద్యోగిగా ఎంపికైతే.. ప్రారంభ వార్షిక వేతనం రూ.1.70 లక్షల నుంచి రూ.2.20లక్షల వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.hcltechbee.com/ పరిశీలించగలరు.