High Court Court Master and Personal Secretary Vacancies in Andhra Pradesh
AP High Court Jobs : అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ , పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 76 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హతక కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధులు అర్హతల విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఇంగ్లిష్ టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. డిగ్రీ(ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్), ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్, హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి జీత భత్యాలుగా రూ.57,100 నుంచి రూ.1,47,760 చెల్లిస్తారు. అక్టోబరు 10, 2022 వరకు దరఖాస్తు గడువు ఉంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; రిజిస్ట్రార్ (పరిపాలన),ఆంధ్రప్రదేశ్ హైకోర్టు,నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా, పిన్-522239, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://hc.ap.nic.in/ పరిశీలించగలరు.