HPCL Job Recruitment: హెచ్​పీసీఎల్ లో జాబ్స్.. రూ.30 వేలు జీతం.. మరిన్ని వివరాలు మీకోసం

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్​పీసీఎల్​) సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సహా పలు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది.

hindustan petroleum corporation limited recruitment 2025

నిరుద్యోగులకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్​పీసీఎల్​) సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సహా పలు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు హెచ్​పీసీఎల్​ అధికారిక వెబ్‌సైట్ hindustanpetroleum.com ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 30 వరకు ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. అనుభవం ఉన్నవారికి మాత్రం జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులు, అర్హత, జీతం వివరాలు ఫ్రెషర్స్ కి:

1.ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: ఈ పోస్టు కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు ఒక సంవత్సరం పూర్తికాల సాధారణ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి రూ.30 వేల నుంచి రూ1.20 వరకు వరకు జీతం ఉంటుంది.

2.జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్(ఫ్రెషర్): సివిల్ ఇంజనీరింగ్‌లో 3 సంవత్సరాల పూర్తికాల డిప్లొమా చేయాల్సి ఉంటుంది. వీరికి రూ.30 వేల నుంచి రూ1.20 వరకు వరకు జీతం ఉంటుంది.

3.జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్(ఫ్రెషర్): మెకానికల్ ఇంజనీరింగ్‌లో 3 సంవత్సరాల పూర్తికాల సాధారణ డిప్లొమా పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి రూ.30 వేల నుంచి రూ1.20 వరకు వరకు జీతం ఉంటుంది.

4.జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్ (ఫ్రెషర్): కెమిస్ట్రీలో 3 సంవత్సరాల పూర్తికాల సాధారణ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి రూ.30 వేల నుంచి రూ1.20 వరకు వరకు జీతం ఉంటుంది.

5.మెకానికల్ ఇంజనీర్(ఫ్రెషర్): మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధిత విభాగాలలో 4 సంవత్సరాల పూర్తికాల సాధారణ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి రూ.50 వేల నుంచి రూ1,60 వరకు జీతం అందుతుంది.

6.ఎలక్ట్రికల్ ఇంజనీర్ (ఫ్రెషర్): ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధిత విభాగాలలో 4 సంవత్సరాల పూర్తికాల సాధారణ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి రూ.50 వేల నుంచి రూ1,60 వరకు జీతం అందుతుంది.

7.సివిల్ ఇంజనీర్(ఫ్రెషర్): సివిల్ ఇంజనీరింగ్ సంబంధిత విభాగాలలో 4 సంవత్సరాల పూర్తికాల సాధారణ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి రూ.50 వేల నుంచి రూ1,60 వరకు జీతం అందుతుంది.

8.కెమికల్ ఇంజనీర్(ఫ్రెషర్): కెమికల్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత విభాగాలలో 4 సంవత్సరాల పూర్తికాల సాధారణ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి రూ.50 వేల నుంచి రూ1,60 వరకు జీతం అందుతుంది.

9.చార్టర్డ్ అకౌంటెంట్: ఇన్​స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి చార్టర్డ్ అకౌంటెంట్, తప్పనిసరి ఆర్టికల్​షిప్, ఐసీఏఐ సభ్యత్వంఉండాలి. కనీసం 3 సంవత్సరాల పూర్తికాల సాధారణ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వీరికి రూ.50 వేల నుంచి రూ1,60 వరకు జీతం అందుతుంది.

10.ఆఫీసర్ హెచ్.ఆర్ (ఫ్రెషర్​): హెచ్.ఆర్/పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/సైకాలజీలో 2 సంవత్సరాల పూర్తికాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/సమానమైన కోర్సు లేదా హెచ్.ఆర్/పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో స్పెషలైజేషన్‌తో మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి రూ.50 వేల నుంచి రూ1,60 వరకు జీతం అందుతుంది.

11.ఆఫీసర్ – ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్(ఫ్రెషర్): ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో 2 సంవత్సరాల పూర్తికాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. మెకానికల్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/కెమికల్/సివిల్ ఇంజనీరింగ్‌లో 4 సంవత్సరాల పూర్తికాల సాధారణ ఇంజనీరింగ్ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీరికి రూ.50 వేల నుంచి రూ1,60 వరకు జీతం అందుతుంది.

పోస్టులు, అర్హత, జీతం వివరాలు అనుభవజ్ఞులకి:

1.అసిస్టెంట్ ఆఫీసర్ / ఆఫీసర్(భాష ప్రధానంగా): హిందీలో 2 సంవత్సరాల పూర్తికాల పోస్ట్-గ్రాడ్యుయేషన్, కనీసం 3 సంవత్సరాల పూర్తికాల సాధారణ గ్రాడ్యుయేషన్ (ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్‌గా ఉండాలి) పూర్తి చేసి ఉండాలి. వీరికి రూ.40 వేల నుంచి రూ.1,60 జీతం అందుతుంది.

2.లా ఆఫీసర్: గ్రాడ్యుయేషన్ తర్వాత 3 సంవత్సరాల పూర్తికాల లా కోర్సు లేదా 12వ తరగతి తర్వాత 5 సంవత్సరాల లా కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి రూ.50 వేల నుంచి రూ.1,60 వరకు జీతం అందుతుంది.

3.లా ఆఫీసర్ హెచ్.ఆర్ (ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్): గ్రాడ్యుయేషన్ తర్వాత 3 సంవత్సరాల పూర్తికాల లా కోర్సు లేదా 12వ తరగతి తర్వాత 5 సంవత్సరాల లా కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి సంవత్సరానికి రూ.15 లక్షలు జీతంగా అందుతుంది.

4.సీనియర్ ఆఫీసర్ – సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ఆపరేషన్స్ & మెయింటెనెన్స్: మెకానికల్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/సివిల్ ఇంజనీరింగ్‌లో 4 సంవత్సరాల పూర్తికాల సాధారణ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి రూ.60 నుంచి రూ.1,80 వరకు జీతం అందుతుంది.

5.సీనియర్ ఆఫీసర్ – సిజిడి ప్రాజెక్ట్స్: మెకానికల్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/సివిల్ ఇంజనీరింగ్‌లో 4 సంవత్సరాల పూర్తికాల సాధారణ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి రూ.60 వేల నుంచి రూ.1,80 వరకు జీతం అందుతుంది.

ఎంపిక విధానం:

ఈ పోస్టుల కోసం అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష / రాత పరీక్ష / టైపింగ్ టెస్ట్, గ్రూప్ టాస్క్ / గ్రూప్ డిస్కషన్/నెట్ స్కోర్ / సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ ఎఫిషియెన్సీ టెస్ట్ లాంటి టెస్టుల ద్వారా ఎంపిక జరుగుతుంది. కొన్ని పోస్టులను బట్టి ఎంపిక విధానం మారవచ్చు.

దరఖాస్తు రుసుము:

ఓబీసీ-ఎన్‌సీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి:

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ hindustanpetroleum.com లోకి వెళ్ళాలి.
  • హోమ్ పేజీలో కెరీర్స్ విభాగంలో జాబ్ ఓపెనింగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • అవసరమైన సమాచారాన్ని, వివరాలను నమోదు చేయాలి.
  • తరువాత ఖాతాలోకి లాగిన్ అవ్వాలి.
  • దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్​ చేయాలి.
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుమును చెల్లించి సబ్మీట్ చేయాలి.