రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ 32,438 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోందన్న విషయం తెలిసిందే. ఇందులో 14 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ఈ నెల 22తో ముగుస్తోంది. దీంతో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామా?
లెవల్-1 ఉద్యోగాల భర్తీకి పది లేదా ఐటీఐ పాసైన వారు అర్హులు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే 18-36 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. సీబీటీ, పీఈటీ, పత్రాల వెరిఫికేషన్, వైద్య పరీక్షల తర్వాత ఎంపిక చేస్తారు.
మహిళలు, పురుషులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆంగ్లంతో పాటు తెలుగులో కూడా పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉంది. https://www.rrbapply.gov.in/లో అప్లై చేసుకోండి.
ఏయే ఉద్యోగాలు?
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీ: 2025 జనవరి 23 నుంచి షురూ..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 2025 ఫిబ్రవరి 22 (రాత్రి 11:59)
దరఖాస్తు రుసుము చెల్లింపు: జనవరి 23 నుంచి ఫిబ్రవరి 24 వరకు
సవరణలకు: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు అవకాశం
అర్హత వివరాలు
విద్యా అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత, ఐటీఐ సర్టిఫికేషన్ లేదా తత్సమాన అర్హత, లేదా ఎన్‌సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (ఎన్‌ఏసీ).
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?