టెన్త్‌ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని భావిస్తున్నారా? ఇలా రీ వాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ చేయించుకోండి..

దరఖాస్తు ఫామ్‌ను ఎస్ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్‌ www.bse.telangana.gov.inలో ఉంచారు.

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని భావిస్తున్న విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు మే 15 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించి రీకౌంటింగ్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చు. సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించి రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకునే ఛాన్స్‌ ఉంది.

రీకౌంటింగ్ కోసం అప్లై చేసుకునే విద్యార్థులు ఎస్‌బీఐ బ్యాంకు ద్వారా హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ కింద చలానా చెల్లించి, వారి దరఖాస్తులను డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌, తెలంగాణ, హైదరాబాద్‌ చిరునామాకు వెళ్లి ఇవ్వచ్చు. లేదా పోస్టులో పంపించవచ్చు.

Also Read: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి.. పూర్తి వివరాలు ఇదిగో..

రీవెరిఫికేషన్ కోసం ఇలా చేయండి
విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో హాల్ టికెట్ జిరాక్స్ కాపీ, కంప్యూటరైజ్డ్ ప్రింటెడ్ మెమో కాపీతో పాటు రీ-వెరిఫికేషన్ దరఖాస్తును సమర్పించాలి. ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్ చేసిన, డీఈవో కార్యాలయానికి సమర్పించిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పోస్ట్ ద్వారా పంపిన దరఖాస్తులను స్వీకరించరు.

దరఖాస్తు ఫామ్‌ను ఎస్ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్‌ www.bse.telangana.gov.inలో ఉంచారు. ఈ దరఖాస్తులను జిల్లా విద్యా శాఖాధికారి నుంచి కూడా పొందవచ్చు. అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున ఈ కింద తెలిపిన హెడ్ ఆఫ్ అకౌంట్ కి మాత్రమే వ్యక్తిగత చలాన్ ద్వారా చెల్లించాలి.

0202 – Education, Sports, Arts & Culture
01 – General Education
102 – Secondary Education
06 – Director of Government Exams 800 User Charges