How to Join ISRO After 12th : ఇస్రోలో సైంటిస్ట్ కావాలని కలలు కంటున్నారా ? అది సాధ్యం కావాలంటే ఇంటర్‌ తర్వాత..

భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్ధలైన IISc, IITలు, NIT, IIST వంటి వాటిలో తాజా గ్రాడ్యుయేట్‌లను ఉద్యోగంలోకి తీసుకునేందుకు ISRO ఆసక్తి చూపుతుంది. అకడమిక్ రికార్డులు బాగా కలిగిన విద్యార్ధులకు ప్రాధాన్యత అధికంగా ఉంటుంది.

Join ISRO After 12th

How to Join ISRO After 12th : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భారతదేశం యొక్క శాస్త్ర సాంకేతిక విజయాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. 1969లో స్థాపించబడిన ఇస్రో, బెంగళూరులో ప్రధాన కార్యాలయంతో అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ అభివృద్ధి వంటి అరుదైన విజయాలు, ప్రయోగాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పనిచేస్తుంది.

READ ALSO : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట..రెగ్యులర్ బెయిల్ మంజూరు

ఇస్రో సాధించిన ఘన విజయాలతో చాలా మంది ఇస్రో వంటి సంస్ధలో ఉద్యోగం సాధించాలని కలలు కంటుంటారు. అయితే చాలా మందికి ఇస్రోలో ఉద్యోగం సాధించాలంటే ఏం చదవాలో తెలియదు. అర్హతలు వంటి విషయాలపై అవగాహన ఉండదు. అలాంటి వారు ఇస్సోలో సైంటిస్ట్ గా చేరటం ఎలాగో ఈ కధనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇంటర్ చదవాల్సిన కోర్సులు ;

ఇస్రోలో శాస్త్రవేత్తగా కెరీర్ ప్రారంభించాలంటే ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్, భౌతిక, రసాయన శాస్త్ర సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాలి. కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. JEE మెయిన్ JEE అడ్వాన్స్‌డ్ ద్వారా అందించే అనేక ఇంజనీరింగ్ విభాగాల్లో విద్యార్థులు తప్పనిసరిగా కంప్యూటర్ సైన్స్, మెకానికల్, రేడియో ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ , ఇతర సంబంధిత సబ్జెక్టులలో తప్పనిసరిగా B.Tech లేదా BEని కోర్సులు చదవాలి.

READ ALSO : Redmi Note 13R Pro : అద్భుతమైన కెమెరాలతో రెడ్‌మి నోట్ 13ఆర్ ప్రో వచ్చేసింది.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

ఇస్రోలో సైంటిస్ట్‌గా కొలువు సాధించాలంటే ఇంటర్ తరువాత బీటెక్ ఇన్ ఏవియానిక్స్ ఇంజినీరింగ్‌, బీటెక్+ఎంఎస్/ఎంటెక్, ఎర్త్ సిస్టమ్ సైన్స్/ఎంటెక్ ఇన్ ఆప్టికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, పీహెచ్‌డీ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బ్యాచిలర్స్ ఇన్ ఫిజిక్స్(బీఎస్‌సీ ఫిజిక్స్), మాస్టర్స్ ఇన్ ఫిజిక్స్(ఎంఎస్సీ ఫిజిక్స్), పీహెచ్‌డీ ఇన్ ఫిజిక్స్, బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ , ఎంఎస్ ఇన్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఆస్ట్రానమీ, మాస్టర్స్ ఇన్ ఆస్ట్రానమీ(ఎంఎస్సీ ఆస్ట్రానమీ), పీహెచ్‌డీ ఇన్ ఆస్ట్రానమీ, బీటెక్ , ఎంటెక్ ఇన్ ఇంజనీరింగ్(మెకానికల్, ఎలక్ట్రికల్, సీఎస్) వంటి కోర్సులు చదవటం ద్వారా ఇస్రోలో ఉద్యోగం సాధించడానికి అర్హులవుతారు.

భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్ధలైన IISc, IITలు, NIT, IIST వంటి వాటిలో తాజా గ్రాడ్యుయేట్‌లను ఉద్యోగంలోకి తీసుకునేందుకు ISRO ఆసక్తి చూపుతుంది. అకడమిక్ రికార్డులు బాగా కలిగిన విద్యార్ధులకు ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు 7.5 CGPA ఉండటం కీలకం. ఇలాంటి వారికే ఇస్రో లో కొలువు సాధించేందుకు అర్హులు.

READ ALSO : Karimnagar : కేసీఆర్ ఎన్నికల ప్రచార రథంలో తనిఖీలు.. సహకరించిన గులాబీ బాస్, సిబ్బంది

ఇస్రోలో ఉద్యోగం సాధించేందుకు ;

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతి సంవత్సరం ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎగ్జామ్ (ICRB)ను నిర్వహిస్తుంది. బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజనీరింగ్), లేదా డిప్లొమా, బీఈ/బీటెక్(లేటరల్ ఎంట్రీ) డిగ్రీ చేసిన వారు ఈ పరీక్ష వ్రాసేందుకు అర్హులు. అయితే ఈ పరీక్షను కంప్యూటర్, మెకానికల్ , ఎలక్ట్రానిక్ విభాగాల్లో స్పెషలైజేషన్ చేసిన అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు ఉద్యోగానికి అర్హులు.

ట్రెండింగ్ వార్తలు