Karimnagar : కేసీఆర్ ఎన్నికల ప్రచార రథంలో తనిఖీలు.. సహకరించిన గులాబీ బాస్, సిబ్బంది
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ వాహనం సైతం విడిచిపెట్టలేదు. కరీంనగర్ గుండ్లపల్లి టోల్‌గేట్ వద్ద కేసీఆర్ ప్రచార రథాన్ని తనిఖీలు చేసారు అధికారులు.

Karimnagar
Karimnagar : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న ఎన్నికల ప్రచార రథాన్ని కేంద్ర ఎన్నికల అధికారులు తనిఖీలు చేసారు. కరీంనగర్‌లోని గుండ్లపల్లి టోల్‌గేట్ వద్ద ఈ తనిఖీలు జరిగాయి.
Assembly Elections 2023: తెలంగాణలో విస్తృతంగా తనిఖీలు.. ఇప్పటి వరకు 600కోట్లకు పైగా సొత్తు సీజ్
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30 వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో జోరు పెంచేసాయి. ఇక పదిరోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతలంతా బిజీగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ప్రయాణిస్తున్న ప్రచార రథాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిలిపివేశారు. బస్సులో అణువణువు తనిఖీలు చేశారు. కరీంనగర్ లోని గుండ్లపల్లి టోల్ గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్, సిబ్బంది అధికారులకు సహకరించారు.
ఇటీవలే సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ప్రయాణిస్తున్న వాహనంలో తనిఖీలు జరిగాయి. ఆమె ధర్మపురిలో ప్రచారానికి వెళ్తుండగా చల్‌గల్ చెక్ పోస్టు వద్ద కారును నిలివేసిన అధికారులు తనిఖీలు నిర్వహించారు.
#WATCH | Election squad checks the bus of Telangana CM KCR in Karimnagar near Gundlapalli toll gate.
(Source: BRS) pic.twitter.com/UqKvdlUnQV
— ANI (@ANI) November 20, 2023