Hyderabad : ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు.. హైదరాబాద్ లో రూ.5 కోట్లు, రూ.12.15 లక్షల విలువైన మద్యం స్వాధీనం

సంగారెడ్డి జిల్లాలో రూ.9.4 లక్షలు, రంగారెడ్డి జిల్లాలోని ఇంబ్రహీంపట్నంలో రూ.6.50 లక్షలను పోలీసులు పట్టుకున్నారు.

Hyderabad : ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు.. హైదరాబాద్ లో రూ.5 కోట్లు, రూ.12.15 లక్షల విలువైన మద్యం స్వాధీనం

Seized Money in Telangana

Hyderabad Police Checks : ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహన సోదాలు చేస్తున్నారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.5 కోట్లకు పైగా నగదు పట్టుబడింది.

సికింద్రాబాద్ లో రూ.50 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ.12.15 లక్షల విలువైన మద్యం బాటిళ్లు, పట్టుబడ్డాయి. సంగారెడ్డి జిల్లాలో రూ.9.4 లక్షలు, రంగారెడ్డి జిల్లాలోని ఇంబ్రహీంపట్నంలో రూ.6.50 లక్షలను పోలీసులు పట్టుకున్నారు.

Also Read:  తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల ఎన్ఐఏ అధికారుల సోదాలు.. భారీగా పోలీసుల మోహరింపు

నిజామాబాద్ జిల్లా – మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు దగ్గర రూ.5.60లక్షలు, పెద్దపల్లి జిల్లాలో రూ.3 లక్షలు, వనపర్తి జిల్లా కొత్తకోటలో రూ.2.35 లక్షలు, మహబూబ్ నగర్ జిల్లాలో రూ.2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం సీజ్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. ఇద్దరు ప్రయాణికుల నుంచి 65 లక్షల రూపాయల విలువ చేసే 1100 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని
పేస్టుగా మార్చి క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచి తరలించే యత్నం చేసిన మస్కట్ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే యత్నం చేసిన బహ్రెయిన్ ప్రయాణికుడు
అడ్డంగా దొరికాడు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.