IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 455 ఉద్యోగాలు.. నెలకు రూ.69 వేల జీతం.. దరఖాస్తు, పూర్తి వివరాలు

నిరుద్యోగులకు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB Recruitment) గుడ్ న్యూస్ చెప్పింది. ఐబీలో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

IB Recruitment: Intelligence Bureau has released a notification for 455 posts.

IB Recruitment: నిరుద్యోగులకు ఇంటెలిజెన్స్ బ్యూరో గుడ్ న్యూస్ చెప్పింది. ఐబీలో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్ పోర్ట్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 455 పోస్టులను(IB Recruitment) భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 6 నుంచి మొదలుకానుంది. అలాగే సెప్టెంబర్ 28 వరకు కొనసాగనుంది. కాబట్టి.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు కూడా ఉంది.

విద్యార్హతలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మోటార్ కార్ల (LMV) కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కనీసం ఒక సంవత్సరం పాటు కారు నడిపిన అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం యొక్క నివాస ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.

వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.21,700 నుంచి ₹69,100 వరకు జీతం వస్తుంది.

ఎంపిక ప్రక్రియ:
ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక విధానం మూడు విభాగాల్లో జరుగుతుంది. మొదటిది టైర్-1 రాత పరీక్ష, రెండవది టైర్-2 డ్రైవింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మూడవది డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్.