IBPS SO Mains Admit Card 2024 Released
IBPS SO Mains Admit Card 2024 : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) మెయిన్స్ ఎగ్జామ్ 2024 కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 14, 2024న నిర్వహించనున్నారు. హాజరు అయ్యేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు పరీక్ష కోసం వారి ఐబీపీఎస్ ఎస్ఓ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2024ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఐబీపీఎస్ ఎస్ఓ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ చేయాలంటే? :
అభ్యర్థులు తమ పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీతో పాటు వారి రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్‌ను ఉపయోగించి ఐబీపీఎస్ ఎస్ఓ మెయిన్స్ 2024 అడ్మిట్ కార్డ్‌ను యాక్సెస్ చేయవచ్చు.
ఐబీపీఎస్ ఎస్ఓ మెయిన్స్ 2024 పరీక్షా విధానం :
లా ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం ఆన్‌లైన్ మెయిన్ పరీక్షలో 60 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్షలు ఉంటాయి. రాజ్‌భాష అధికారి స్థానానికి సంబంధించిన ఆన్‌లైన్ మెయిన్ పరీక్షలో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలు రెండూ ఉంటాయి.
ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. డిస్క్రిప్టివ్ టెస్ట్ కోసం అభ్యర్థులు తమ రెస్పాన్స్ కంప్యూటర్‌లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ పూర్తయిన వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్‌లకు మొత్తం సమయం 1 గంట ఉండగా మొత్తం మార్కులు 60 ఉంటుంది. పరీక్షలకు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలకు వేర్వేరు సమయం ఉంటుంది.
తప్పు సమాధానాలకు పెనాల్టీ :
ఆబ్జెక్టివ్ పరీక్షలలో తప్పు సమాధానాలకు పెనాల్టీ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి, అభ్యర్థి స్కోర్‌లో మార్కులు తగ్గుతాయి. తప్పు ప్రశ్నకు కేటాయించిన మార్కులలో నాలుగో వంతు (0.25) పెనాల్టీగా తొలగిస్తారు. సమాధానం లేని ప్రశ్నలకు ఎలాంటి నెగటివ్ మార్క్ ఉండదు.
ఐబీపీఎస్ ఎస్ఓ మెయిన్స్ పరీక్ష 2024 డిసెంబర్ 14, 2024న జరుగనుంది. 896 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఖాళీలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ షెడ్యూల్ ఖరారు అయింది. ప్రిలిమ్స్ పరీక్ష నవంబర్ 9, 2024న నిర్వహించారు. ఈ పరీక్షా ఫలితాలు డిసెంబర్ 3, 2024న ప్రకటించారు.
Read Also : CBSE Practical Exam Dates : సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ ఎగ్జామ్ తేదీలివే.. ఫుల్ గైడ్‌లైన్స్!