ICAI CA Result 2025: చార్టర్డ్ అకౌంటెన్సీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. అదరగొట్టిన తెలుగు విద్యార్థులు..

ఫలితాల కోసం వెబ్‌సైట్ icai.nic.in ఓపెన్ చేయండి.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) ఇంటర్మీడియట్, ఫౌండేషన్ కోర్సు ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలను 2025 జనవరిలో నిర్వహించారు.

ఫలితాలను https://icai.nic.in/caresult/foundation/ లో చూసుకోవచ్చు. ఈ లింక్‌ ఓపెన్ చేసి విద్యార్థులు రోల్‌ నంబర్‌తో పాటు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, బర్త్‌ డే వంటి వివరాలను టైప్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో స్కోరు కార్డులు చూసుకోవచ్చు.

ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన దీపాన్షి అగర్వాల్‌ 600 మార్కులకు 521 స్కోరు (86.83 శాతం)తో అగ్రస్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ విద్యార్థి థోటా సోమనాద్ శేషాద్రి నాయుడు 516 మార్కుల (86 శాతం)తో ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌ విద్యార్థి సర్తక్ అగర్వాల్ 515 మార్కులు (85.83 శాతం) సాధించి తృతీయ స్థానంలో నిలిచారు.

సీఏ ఇంటర్‌ గ్రూప్‌ 1 పరీక్షను జనవరిలో 1,08,187 మంది రాశారు. వారిలో 15,332 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అలాగే, గ్రూప్‌ 2 పరీక్షలో 22.16 శాతం మంది, రెండు గ్రూప్‌ల విభాగంలో 14.05 శాతం మంది పాస్ అయ్యారు. ఫౌండేషన్‌ పరీక్షలో పాస్ అయిన వారి శాతం 21.52గా ఉంది.

 ఫలితాలు ఇలా చూసుకోవచ్చు..

  • ఫలితాల కోసం వెబ్‌సైట్ icai.nic.in ఓపెన్ చేయండి
  • ICAI CA ఇంటర్/ఫౌండేషన్ జనవరి రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి
  • మీ లాగిన్ వివరాలను టైప్‌ చేయండి
  • మీ రిజల్ట్స్ వస్తాయి
  • కాపీ డౌన్‌లోడ్ చేసుకోండి