Recruitment 2025: బ్యాంకులో ఉద్యోగాలు.. ఉద్యోగం వస్తే వార్షిక ఆదాయం రూ.6,14,000

హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ రిక్యూట్‌మెంట్‌ ద్వారా మొత్తం 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మార్చి 1 నుంచి అదే నెల 12 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

డిగ్రీ ఉత్తీర్ణులై వయసు 20-25 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. అభ్యర్థులు మొదట ఆన్‌లైన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అనంతరం ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

జనరల్ అభ్యర్థులకు 260, ఎస్సీ అభ్యర్థులకు 100, ఎస్టీ అభ్యర్థులకు 54, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 65, ఓబీసీ అభ్యర్థులకు 171, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 26 ఉద్యోగాలు ఉన్నాయి.

దరఖాస్తు ఫీజు అంశానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.250గా దీన్ని నిర్ణయించారు. ఇతర కేటగిరీలోకి వచ్చే అభ్యర్థులు రూ.1,050తో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగానికి ఎంపికైతే ట్రైనింగ్ సమయంలో భృతి ఇస్తారు.

ఆ సమయంలో నెలకు రూ.15,000 పొందవచ్చు. ఉద్యోగం వస్తే వార్షిక ఆదాయం రూ.6,14,000- రూ.6,50,000 మధ్య ఉంటుంది. హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. పరీక్ష, ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్‌ అయిన వారు పీజీడీబీఎఫ్‌ కోర్సు విజయవంతంగా పూర్తి చేయాలి.

పూర్తి నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి