IIIT Basara: బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ తేదీలు ఇవే..

విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని అధికారులు సూచించారు.

IIIT Basara – Counselling: తెలంగాణలోని నిర్మల్ (Nirmal) జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీట్లు సాధించిన వారిలో 67 శాతం మంది బాలికలు, 33 శాతం మంది బాలురు ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా సిద్దిపేట జిల్లా నుంచి 322 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి.

ఇక అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. 93 శాతం ప్రభుత్వ పాఠశాలలు, 7 శాతం ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులను ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఉంటుంది.

రోజుకి 500 మంది విద్యార్థులు చొప్పున కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల14న వికలాంగులు, స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. 15న ఎన్సీసీ (NCC), క్యాప్ (CAP) సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని అధికారులు సూచించారు.

IBPS Clerk Notification : డిగ్రీ అర్హతతో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో 4,045 క్లర్క్‌ ఉద్యోగాల భర్తీ

More Education and Job News

ట్రెండింగ్ వార్తలు