IIT Madras Technical Courses : విద్యార్థులకు ఐఐటీ మద్రాసు ఆఫర్.. 11 ప్రాంతీయ భాషల్లో 198 టెక్నికల్ కోర్సులు..!

IIT Madras Technical Courses : ఐఐటీ మద్రాస్ ఎన్‌పీటీఈఎల్ 198 టెక్నికల్ కోర్సులను అందిస్తోంది. అత్యధికంగా దక్షిణ భారత భాషల్లోనే కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

IIT Madras Technical Courses : మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంతో ఐఐటీ మద్రాస్ ప్రాంతీయ భాషల్లో టెక్నికల్ కోర్సులను అందిస్తోంది. ప్రధానంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి వివిధ మాతృభాషలలో సాంకేతిక విద్యను అందిస్తోంది. ఐఐటీ మద్రాస్ (NPTEL) దక్షిణ భారత భాషల్లో ‘ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్ పైథాన్‌ని ఉపయోగించే అల్గారిథమ్స్’ వంటి అత్యంత డిమాండ్ ఉన్న కోర్సులతో సహా 198 టెక్నికల్ కోర్సులను అందిస్తోంది.

Read Also :  CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

అయితే, ఈ కోర్సులు దక్షిణ భారతీయ భాషలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. NPTEL (నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్), ఐఐటీ, ఐఐఎస్‌సీ జాయింట్ వెంచర్, విద్యా మంత్రిత్వ శాఖ (MoE) ద్వారా నిధులు సమకూరుస్తుంది.

ఎన్‌పీటీఈఎల్ కోర్సులను అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగుతో సహా 11 భాషల్లో అందిస్తోంది. ప్రాంతీయ భాషలలో చదువుకున్న విద్యార్థులు సాంకేతిక విద్య కోర్సులో చేరేందుకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది.

కంప్యూటర్ సైన్స్ (37 కోర్సులు), ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (35 కోర్సులు), హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ (29 కోర్సులు)పై దృష్టి సారిస్తోంది. నాణ్యమైన విద్యను దేశం నలుమూలలకు తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా ప్రారంభంలో ఎన్‌పీటీఈఎల్ ఇప్పుడు, భారత్ అంతటా విద్యార్థులకు, వర్కింగ్ స్పెషలిస్టులకు ప్రతి సెమిస్టర్‌కు వందల కొద్దీ కోర్సులను అందిస్తోంది.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

ట్రెండింగ్ వార్తలు