India Post GDS recruitment 2025
India Post GDS Recruitment : భారత పోస్టల్ శాఖ బంపర్ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఇండియన్ పోస్ట్, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లోని వివిధ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియా పోస్ట్ 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు నియామకాలను ప్రకటించింది.
10వ తరగతి పాసైన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి ఇది ఒక సువర్ణావకాశం. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు ఇండియన్ పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ (indiapostgdsonline.gov.in)లో ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. భారత తపాలా శాఖ ఈ నియామకానికి పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతగల అభ్యర్థులు మార్చి 3, 2025 వరకు అధికారిక పోస్టల్ శాఖ వెబ్‌సైట్లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారమ్ అప్లికేషన్ ఎడిట్ విండో మార్చి 6 నుంచి మార్చి 8, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 1215 పోస్టులు ఉండగా, తెలంగాణలో 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పది పాసైన వారు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టల్ ఖాళీలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు కనీసం సైకిల్, స్కూటర్ డ్రైవింగ్ తెలిసి ఉండాలి. 10వ తరగతిలో మార్కుల ఆధారంగా పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు ఎవరైనా సరే మార్చి 3 వరకు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.
ఆసక్తిగల అభ్యర్థులు పోస్టల్ శాఖలో ఆన్‌లైన్ అప్లికేషన్ (Application Process) సమర్పించే ముందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీ మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ ఉండాలి.
ఈ దరఖాస్తుకు సమర్పణకు ఒక అభ్యర్థికి ఒకే రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. అయితే, అప్లికేషన్ ఫారమ్‌తో ఎలాంటి డాక్యుమెంట్లను జత చేయనక్కర్లేదు.
అభ్యర్థి రీసెంట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి. ఈ జీడీఎస్ పోస్టులకు ఎంపికైన వారు కేంద్ర ప్రభుత్వం/ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు కారని గమనించాలి. ఈ పోస్టులకు ఎంపికైన వారి వేతనాలు, అలవెన్సులు, ఇతర అర్హతలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉండవని అభ్యర్థులందరూ గమనించాలి.
మొత్తం ఖాళీలివే :
పోస్టులు : 21,413 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ : 1215 ఖాళీలు
తెలంగాణలో : 519 ఖాళీలు
వేతనం ఎంతంటే? :
బీపీఎం పోస్టులకు : రూ.12వేల నుంచి రూ.29,380 వరకు
ABPM/డాక్ సేవక్ – రూ.10వేల నుంచి రూ.24,470 వరకు
దరఖాస్తు ప్రక్రియ ఇలా :
అధికారిక వెబ్‌సైట్ (indiapostgdsonline.gov.in)ని విజిట్ చేయండి.
‘Register’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
మీ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
మీ వ్యక్తిగత, విద్యా, కాంటాక్టు సమాచారాన్ని ఎంటర్ చేయండి.
మీ ఫోటో, సిగ్నేచర్, విద్యార్హత సర్టిఫికెట్ల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి.
పేమెంట్ ఆన్‌లైన్‌లో చేయండి.
ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీ దరఖాస్తు కాపీని సేవ్ చేసుకోండి.
వయోపరిమితి :
గ్రామీణ డాక్ సేవక్ పదవికి, 2025 మార్చి 3 నాటికి 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాలు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యా అర్హతలివే :
ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల విద్యా బోర్డు నుంచి గణితం, ఇంగ్లీష్‌లో 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు గ్రామీణ డాక్ సేవక్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము :
జీడీఎస్ (GDS) నియామకాలకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ, మహిళలకు దరఖాస్తు ఉచితం. దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ మోడ్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది.