ఇండియన్ ఆర్మీలోని ‘ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్’ 2020 విద్యాసంవత్సరానికి గాను వివిధ కళాశాల్లలో B.sc నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఇందుకు మహిళా అభ్యర్ధులు మాత్రమే అర్హులు. ఈ కోర్సుకు ఎంపికైన వారు 4 సంవత్సరాల పాటు ఉచితంగా B.sc నర్సింగ్ కోర్సును పూర్తి చేయవచ్చు. చదువు పూర్తి అయిన తర్వాత ఉద్యోగం ఇస్తారు. ఈ కోర్సును దేశ వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లలో నిర్వహిస్తున్నారు. ఆస్తకిగల అభ్యర్ధులు ఆన్ లైన్ లో ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం :
అభ్యర్ధులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్డులకు ‘మే’ నెలలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
విద్యార్హత :
Bpc మెుదటి సంవత్సరంలో 50శాతం మార్కులతో పాసైన వారు, రెండవ సంవత్సరం చదువుతున్నా వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
అక్టోబర్ 1,1995 నుంచి సెప్టెంబరు 30,2003 మధ్య జన్మించిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యతేదిలు:
> దరఖాస్తు ప్రారంభ తేది: 14 నవంబర్, 2019.
> దరఖాస్తు చివరి తేది: 2 డిసెంబర్, 2019.
> పరీక్ష తేది: మార్చి 2020.
> పరీక్ష ఫలితాలు: ఏప్రిల్ 2020.
> ఇంటర్వ్యూ తేది: మే 2020.