Indian Bank Recruitment 2025 Started
ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 1500 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు కొనసాగనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.indianbank.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు తమ డిగ్రీని 01.04.2021 తర్వాత పూర్తి చేయాల్సి ఉంటుంది.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 800, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాషా ప్రావీణ్యత పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ లాంటి ఐదు విభగాల్లో ఉంటుంది. ఇక స్థానిక భాషా ప్రావీణ్యత పరీక్ష దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆ రాష్ట్రంలోని స్థానిక భాషల్లో చదవడం/రాయడం/ మాట్లాడటం/ అర్థం చేసుకోవడం ఇలా ఏదో ఒకటైనా తెలిసి ఉండాలి.