ఇంటర్ అర్హతతో.. ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ లో ఉద్యోగాలు

  • Publish Date - January 7, 2020 / 01:45 AM IST

ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ నావిక్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

విద్యార్హత: 
అభ్యర్ధులు 50 శాతం మార్కులతో ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్‌ లో ఎక్కువగా అవగాహన ఉండాలి. SC, ST, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

Read Also..జీతం 28వేలు : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు

వయోపరిమితి: 
అభ్యర్థుల వయసు 18 నుంచి 22 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:
అభ్యర్ధులను రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు INS చిల్కాలో 2020 ఆగస్టు నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. 

ముఖ్యతేదిలు:
దరఖాస్తు ప్రారంభం: జనవరి 26, 2020.
దరఖాస్తు చివరితేది: ఫిబ్రవరీ 2, 2020.
అడ్మిట్ కార్డు డౌన్లోడ్: ఫిబ్రవరీ 15 నుంచి 22 వరకు.