Coast Guard Recruitment 2025: ఇండియన్ కోస్ట్ గార్డ్ లో జాబ్స్.. అసిస్టెంట్ కమాండెంట్ బ్యాచ్ లో 170 పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి

Coast Guard Recruitment 2025: జనరల్ డ్యూటీ(జీడీ)కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.

Indian Coast Guard Recruitment 2025

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ బ్యాచ్ 2027 కోసం నియామక ప్రక్రియను ప్రారంభించింది. జనరల్ డ్యూటీకీ సంబంధించి 140 పోస్టులు, టెక్నికల్‌కు సంబంధించి 30 పోస్టులను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జులై 8వ తేదీ నుంచి జులై 23 మధ్యలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు joinindiancoastguard.cdac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శింసిచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత:

జనరల్ డ్యూటీ(జీడీ)కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.
టెక్నికల్ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

వయోపరిమితి:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జులై 1 2026 నాటికి 21 నుంచి 25 మధ్యలో ఉండాలి.
అలాగే గతంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లేదా కోస్ట్ గార్డ్‌లో పనిచేసి ఉంటే వారికి గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

జనరల్, ఓబీసీ, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు ఎలాంటి రుసుము ఉండదు.

దరఖాస్తు చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ joinindiancoastguard.cdac.in లోకి వెళ్ళాలి
  • హోమ్‌పేజీలో CGCAT 2027 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • వార్తలు/ప్రకటనలు విభాగంలో అప్లికేషన్ లింక్‌ను ఓపెన్ చేయాలి.
  • మీ వ్యక్తిగత కొత్త ఖాతాను క్రియేట్ చేయాలి
  • అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయండి
  • రిజిస్ట్రేషన్ తర్వాత, లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్ నింపండి.
  • దరఖాస్తు రుసుము చెల్లించి ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.