Faculty Recruitment : విశాఖ పట్నంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం కెమికల్ ఇంజినీరింగ్, ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీటెక్, బీఈ, పీహెచ్ డీ, పూర్తి చేసి ఉండాలి. ప్రొఫెసర్ గా 10ఏళ్ళ అనుభవం కలిగి ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ గా 6ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి.
READ ALSO : Prevention Of Pests : వరిలో చీడపీడల నివారణ, రైతులకు శాస్త్రవేత్తల సూచనలు !
అభ్యర్ధుల వయస్సు 35 నుండి 55 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే స్క్రీనింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది 2023, మార్చి 31గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://iipe.ac.in/careers పరిశీలించగలరు.