Indian Navy has released a notification for 1,266 Civilian Tradesmen Skilled posts.
నిరుద్యోగులకు ఇండియన్ నేవీ గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1,266 సివిలియన్ ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబందించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టి నుండే మొదలుకానుంది. ఇది సెప్టెంబర్ 2వ తేదీ వరకు కొనసాగనుంది. కాబట్టి, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అధికారిక వెబ్ సైట్ indiannavy.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు, పోస్టుల వివరాలు:
ఆక్సిలరీ, సివిల్ వర్క్స్, ఫౌండ్రీ, హీట్ ఇంజిన్లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & గైరో, ఇన్‌స్ట్రుమెంట్, మెకాట్రానిక్స్, మెకానికల్, మెకానికల్ సిస్టమ్స్, మెటల్, మిల్‌రైట్, రిఫ్రిజిరేషన్ & AC, షిప్ బిల్డింగ్, వెపన్ ఎలక్ట్రానిక్స్‌తో సహా ఇండియన్ నేవీ యార్డులు &యూనిట్లలోని వివిధ ట్రేడ్‌లలో ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:
అభ్యర్థులు ఇంగ్లీష్ పరిజ్ఞానంతో గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ (తరగతి 10) లేదా తత్సమానంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసి ఉండాలి, ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్ నుంచి టెక్నికల్ బ్రాంచ్‌లో రెండు సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్‌తో మెకానిక్ అర్హత ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు మించకూడదు.
ఎంపిక విధానం;
ఎంపిక విధానం రెండు విభాగాల్లో జరుగుతుంది. ముందుగా రాత పరీక్ష ఉంటుంది. తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది.
వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం అందుతుంది.