Indian Oil Corporation Limited Job Vacancies
IOCL Recruitment : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్ )లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 1535 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత, కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాల విషయానికి వస్తే ట్రేడ్ అప్రెంటిస్,అటెండెంట్ ఆపరేటర్ 396, ట్రేడ్ అప్రెంటీస్ (ఫిట్టర్) 161, ట్రేడ్ అప్రెంటీస్ (బాయిలర్) 54, టెక్నీషియన్ అప్రెంటిస్ కెమికల్ 332, టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్ 163, టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్ 198, టెక్నీషియన్ అప్రెంటిస్ 198,సెక్రటేరియల్ అసిస్టెంట్ 39, ట్రేడ్ అప్రెంటీస్- అకౌంటెంట్ 45, ట్రేడ్ అప్రెంటీస్- డేటా ఎంట్రీ ఆపరేటర్ 41 ట్రేడ్ అప్రెంటీస్- డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్) 32 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, క్లాస్ 12 విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; WWW. iocl.com పరిశీలించగలరు.