Indian Overseas Bank has released a notification for 750 apprentice posts.
బ్యాంకింగ్ రంగంలో సెట్ అవుదాం అనుకునేవారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) 750 పోస్టులకు నిటిఫికేషన్ విడుదల చేసింది. సంస్థలో ఖాళీగా ఉన్న 750 అప్రెంటిస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 20తో ముగియనుంది. కాబట్టి, ఆసక్తిగల అభ్యర్థులు ఐఓబీ అధికారిక వెబ్‌సైట్ iob.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థత:
ఈ పోస్టుల కోసం అప్లై చేస్తున్న అభ్యర్థులు భారత ప్రభుత్వం గుర్తించిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా దానికి సమానమైన చదువును పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2025 నాటికి 20 ఏళ్ళ నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు సంబందించిన ఎంపిక ప్రక్రియ మూడు విభాగాలుగా జరుగుతుంది. ముందుగా ఆన్‌లైన్ పరీక్ష, తరువాత స్థానిక భాషా నైపుణ్య పరీక్ష, వ్యక్తిగత ఇంటరాక్షన్(బ్యాంక్ నిర్ణయం మేరకు) ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 944, దివ్యాంగులు (పీడబ్ల్యూబీడీ) రూ. 472, మహిళలు/ఎస్టీ/ఎస్సీ అభ్యర్థులు రూ.708 చెల్లించాల్సి ఉంటుంది.