Bank Jobs: బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. మొత్తం పోస్టుల సంఖ్య 127. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఆర్క్, బీటెక్, బీఈ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయలు. SC,ST,PWDలకు రూ.175. పూర్తి వివరాలకు https://www.iob.in/ వెబ్ సైట్ కి వెళ్లాలి.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. దీని హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది. దేశవ్యాప్తంగా బ్రాంచులు ఉన్నాయి. విదేశాల్లోనూ బ్రాంచులు ఉన్నాయి. 127 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 3 చివరి తేదీ. www.iob.in వెబ్ సైట్ కి వెళ్లి ఆన్ లైన్ లో మాత్రమే అప్లయ్ చేసుకోవాలి.
అప్లయ్ చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ ను జాగ్రత్తగా చదువుకోవాలి. చెల్లించిన ఫీజుని రీఫండ్ చేయరు. జీతం 64వేల నుంచి 93వేలుగా ఉంది. ఆన్ లైన్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ని అధికారిక వెబ్ సైట్ లో పబ్లిష్ చేస్తారు.