Indian Defence
Job replacement : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఫనాజీలోని ఇండియన్ నేవీకి చెందిన సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్ గోవాలో పలు ఉద్యోగ ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. అబ్సార్‌ప్షన్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 3ఖాళీలను భర్తీ చేయనుండగా, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల వివరాల విషయానికి వస్తే రిపేరర్, ఎంటీఎస్ గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత సాధించి ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానానికి సంబంధించి అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి చేసిని దరఖాస్తులను కమాండెంట్ హెడ్ క్వార్టర్స్, 2 సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్, పనాజీ గోవా-403001 చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీమార్చి 25, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://joinindianarmy.nic.in/