IBPS Makes key changes in PO exam
ఐబీపీఎస్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సంవత్సరం జరుగుతున్న ఐబీపీఎస్ పీఓ 2025 ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ పాటర్న్‌లో భారీ మార్పులు చేయనున్నారు. కొన్ని చోట్ల ప్రశ్నలను, కొన్ని చోట్ల సమయాన్ని తగ్గిస్తూ, ఇంకొన్ని చోట్ల ప్రశ్నల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్తిలు ఈ విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి ఆ మార్పుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రిలిమినరీ పరీక్షలో మార్పులు:
గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టు మార్కులను 35 నుంచి 30కి తగ్గించారు. రీజనింగ్ ఎబిలిటీ మార్కులను 30 నుంచి 40కి పెంచారు. ఇందులో కేవలం మార్కుల ప్యాటర్న్ మాత్రమే మార్చడం జరిగింది. టోటల్ మార్కులు, పరీక్షా సమయం ఎలాంటి మార్పు లేదు.
మెయిన్స్ పరీక్షలో మార్పులు:
ఇక పీఓ మెయిన్స్ పరీక్షల విషయానికి వస్తే రీజనింగ్- కంప్యూటర్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్రశ్నల సంఖ్యను 45 నుంచి 40కి తగ్గించారు. పరీక్ష సమయాన్ని కూడా 60 నిమిషాల నుంచి 50 నిమిషాలకు తగ్గించారు.
ఇక జనరల్/బ్యాంకింగ్ అవేర్‌నెస్/ఎకానమీ సబ్జెక్టులకు ఎక్కువ మార్కులను కేటాయించి ప్రశ్నల సంఖ్య తగ్గించారు. వీటికి 50 మార్కులు, 35 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం కూడా 35 నిమిషాల నుంచి 25 నిమిషాలకు తగ్గించారు.
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్‌కు గత సంవత్సరం 60 మార్కులు కేటియిస్తే ఈ సంవత్సరం 50 మార్కులకు తగ్గించారు.
ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ పరీక్షలలో మొత్తం ఆబ్జెక్టివ్ ప్రశ్నల సంఖ్య 155 ఉండేవి ఇప్పుడు 145కి తగ్గించారు. పరీక్షా సమయం కూడా 180 నిమిషాల నుంచి 160 నిమిషాలకు తగ్గించారు. కాబట్టి, అభ్యర్థులు పైన తెలిపిన మార్పులకు అనుగుణంగా సబ్జెక్టులను ప్రిపేర్ అవడం మంచిది.