ICF Recruitment : ఇంటిగ్రల్ కోచ్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

అభ్యర్థులను అకడమిక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా నేరుగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు అప్రెంటిస్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు జూన్ 30, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

ICF Recruitment : ఇంటిగ్రల్ కోచ్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

Integral Coach Factory Apprentice Vacancies

Updated On : June 14, 2023 / 7:31 AM IST

ICF Recruitment : భారత ప్రభుత్వ రంగ సంస్థ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్‌ ఫ్యాక్టరీ లో పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 782 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న అప్రెంటిస్ ఖాళీలు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్‌టీ రేడియాలజీ, ఎంఎల్‌ పాథాలజీ, కార్పెంటర్, పీఏఎస్‌ఏఏ తదితర విభాగాల్లో ఉన్నాయి.

READ ALSO : Lose Belly Fat : బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడానికి వేగవంతమైన మార్గం ఏది?

ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కుల‌తో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటుగా సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంట‌ర్, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

READ ALSO : Foods to Help Fight Stress : ఒత్తిడికి గురైనప్పుడు తీసుకోవాల్సి ముఖ్యమైన 5 ఆహారాలు ఇవే ?

అభ్యర్థులను అకడమిక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా నేరుగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు అప్రెంటిస్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు జూన్ 30, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://icf.indianrailways.gov.in/ పరిశీలించగలరు.