Tirupati : తిరుపతి నగరంలో విషాద ఘటన.. ప్రేమజంట ఆత్మహత్య.. లాడ్జిలో సూసైడ్ నోట్ ..

తిరుపతి (Tirupati) నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.

Tirupati : తిరుపతి నగరంలో విషాద ఘటన.. ప్రేమజంట ఆత్మహత్య.. లాడ్జిలో సూసైడ్ నోట్ ..

Tirupati

Updated On : August 24, 2025 / 12:38 PM IST

Tirupati : తిరుపతి నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట పారిపోయి తిరుపతికు వచ్చింది. తల్లిదండ్రులు తమ పెళ్లి చేయరని నిర్ణయించుకుని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.

Also Read: Medchal district : భార్యను ముక్కలు చేసిన కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఆ 25 రోజుల్లో ఏం జరిగింది.. మృతురాలి తల్లి ఏం చెప్పారంటే..

ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటకకు చెందిన వెంకటరాజు, అనూషలుగా గుర్తించారు. లాడ్జిలో సూసైడ్ లేఖను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.