IB ACIO 2025: బంపర్ ఆఫర్.. డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్.. నెలకు లక్షల జీతం.. దరఖాస్తు, పూర్తి వివరాలు

IB ACIO 2025: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఒకటైన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) 3,717 ఖాళీలను భర్తీ చేయనుంది.

IB ACIO 2025: బంపర్ ఆఫర్.. డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్.. నెలకు లక్షల జీతం.. దరఖాస్తు, పూర్తి వివరాలు

intelligence bureau ACIO 2025 Recruitment

Updated On : July 15, 2025 / 4:09 PM IST

డిగ్రీ పాసైన వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఒకటైన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) 3,717 ఖాళీలను భర్తీ చేయనుంది. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-II/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే షార్ట్ నోటీసు విడుదల కాగా కీలకమైన వివరాలు త్వరలోనే వెల్లడించింది. IB ACIO 2025కు పూర్తి నోటిఫికేషన్ జూలై 19న విడుదల కానుంది. కాబట్టి, ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించుకోవాలి. షార్ట్ నోటీస్ ప్రకారం 3,717 పోస్టులు భర్తీకి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.

కేటగిరీ వారీగా పోస్టుల వివరాలు:

  • జనరల్ (UR) 1,537 పోస్టులు
  • ఓబీసీ (OBC) 946 పోస్టులు
  • ఎస్సీ (SC) 566 పోస్టులు
  • ఎస్టీ (ST) 226 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్ (EWS) 442 పోస్టులు

విద్యాఅర్హతలు:

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి:
అభ్యర్థుల కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 27 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ గల అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:
రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగనుంది. టైర్-1 పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), టైర్-2 (డెస్క్రిప్టివ్ టైప్), ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ మూడు దశల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతం అందుతుంది. ఇతర అలవెన్సులు, సదుపాయాలు కూడా ఉంటాయి.