ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా 

  • Publish Date - April 28, 2019 / 10:59 AM IST

హైదరాబాద్: మే 16వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను మే 16వ తేదీ నుంచి  మే 25 తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు  నిర్వహించనున్నారు. జూన్ 7వ తేదీ నుంచి జూన్ 10 తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ ప్రయోగపరీక్షలు ఉంటాయని బోర్డు అధికారులు తెలిపారు.