Intermediate Exams : ఏపీ, తెలంగాణలో ఇంటర్ పరీక్షలు

ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏపీ వ్యాప్తంగా 1489 పరీక్షా కేంద్రాలు, తెలంగాణ వ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పోలీసులు 144 సెక్షన్ విధించారు.

Intermediate Exams : ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏపీ వ్యాప్తంగా 1489 పరీక్షా కేంద్రాలు, తెలంగాణ వ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పోలీసులు 144 సెక్షన్ విధించారు. తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు సెట్-C ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు.

మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష కొనసాగనుంది. పలు చోట్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు సెంటర్ లోపలికి అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Exam Center Locator App : ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్.. ఎగ్జామ్ సెంటర్ కు ఈజీగా వెళ్లొచ్చు!

తెలంగాణలో 1,473 ఎగ్జామ్ సెంటర్లల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బుధవారం ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ కు 4,82,677 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు