ISRO has released a notification for the recruitment of 96 apprentice posts.
Isro Jobs: నిరుద్యోగులకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) శుభవార్త చెప్పింది. సంస్థలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 96 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ(Isro Jobs) ఆగస్టు 22 నుంచి మొదలుకానుంది. ఈ గడువు సెప్టెంబర్ 11తో ముగియనుంది. కాబట్టి.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.isro.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చ.
Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 700 పైగా ఉద్యోగాలతో భారీ జాబ్ మేళా.. పూర్తి వివరాలు మీకోసం
విద్యార్హతలు:
ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో బి.ఏ (B.A), బి.కాం (B.Com), బి.ఎస్సీ (B.Sc), బి.టెక్/బి.ఇ (B.Tech/B.E), డిప్లొమా (Diploma), బి.లిబ్ (B.Lib) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్టైఫండ్ వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ప్రతి నెల స్టైఫండ్ చెల్లిస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.9,000 స్టైఫండ్ ఇస్తారు.
డిప్లొమా (టెక్నీషియన్ అప్రెంటిస్) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.8,000 స్టైఫండ్ ఇస్తారు.
డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.8,000 స్టైఫండ్ ఇస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (జనరల్ స్ట్రీమ్) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.9,000 స్టైఫండ్ ఇస్తారు.
ఎంపిక విధానం:
విద్యార్హతలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, ఇతర ఎంపిక పద్ధతుల ఆధారంగా జరగవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో ఉంచడం జరిగింది.