CBSE క్లారిటీ : మెయిన్ సబ్జెక్టులకే పెండిగ్ 10,12వ తరగతి ఎగ్జామ్స్

10,12వ తరగతి ఎగ్జామ్స్ విషయంలో వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ పరీక్షల విషయంలో క్లారిటీ ఇచ్చింది CBSE. ఏప్రిల్-1న ప్రకటించిన విధంగానే లాక్ డౌన్ ముగిసిన తర్వాత పెండింగ్ లో ఉన్న 10,12వ తరగతి మెయిన్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఎగ్జామ్స్ ప్రారంభించడానికి ముందు 10రోజుల సమయం ఇవ్వనున్నట్లు లక్షలాదిమంది విద్యార్ధులకు CBSE బోర్డు భరోసా ఇచ్చింది. 

10వ తరగతి CBSE బోర్డు పరీక్షలకు సంబంధించి ఇటీవల చాలా ఊహాగానాలు వచ్చాయి. 10 మరియు 12 తరగతుల 29 సబ్జెక్టులకు బోర్డు పరీక్షలు చేయాలన్న బోర్డు నిర్ణయం 1.4.20న విడుదల చేసిన సర్క్యులర్ లో పేర్కొన్న విధంగానే ఉందని పునరుద్ఘాటిస్తూ CBSE బుధవారం(ఏప్రిల్-29,2020)ఓ ట్వీట్ చేసింది.

సిబిఎస్ఈ బోర్డు ప్రధాన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తుంది, పై తరగతికి అవసరమైన మరియు ఉన్నతవిద్యాసంస్థల్లో ప్రవేశాలకు అవసరమైన మెయిన్ సబ్జెక్టులకు మాత్రమే CBSE పరీక్షలు నిర్వహించనుంది. మిగిలిన సబ్జెక్టులకు, సిబిఎస్‌ఇ పరీక్షలు నిర్వహించదు.  అందువల్ల, బోర్డు పరీక్షలు నిర్వహించే స్థితిలో ఉన్నప్పుడు, అది 29 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలను నిర్వహిస్తుంది.