January 2026 Holidays
January 2026 Holidays : విద్యార్థులకు పండగే పండగ.. వచ్చే జనవరి 2026లో స్కూళ్లు, కాలేజీలకు భారీగా సెలవులు ఉన్నాయి. అందులో పండగ సెలవుల దగ్గర నుంచి వారాంతపు సెలవులు వరుసగా ఉండనున్నాయి. ఈ సెలవుల సమయాన్ని చాలామంది ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు.
మీరు కూడా ఎక్కడికైనా వెళ్దాలని భావిస్తుంటే (January 2026 Holidays) ఇది మీకోసమే.. రాబోయే నెలలో సంక్రాంతి సెలవులతో పాటు నెలాఖరున రిపబ్లిక్ డే వరకు వరుస సెలవులు ఉన్నాయి. ఈ నెలలో ట్రిప్ ప్లాన్ చేసుకునే వారు ఫుల్ గా ఎంజాయ్ చేసి రావొచ్చు.
సాధారణంగా జనవరి 2026లో విహారయాత్రలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొత్త ఏడాది ప్రారంభంలో సెలవులు దొరికితే చాలు ఎక్కడికి వెళ్దామా అని తెగ హైరానా పడిపోతుంటారు. 2026లో జనవరి ఒకటో తేదీ గురువారం.. కొత్త సంవత్సరం రోజున హాలిడే ఉంటుంది.
జనవరి 2న శుక్రవారం ఒక్క రోజు సెలవు పెడితే శని, ఆదివారం వరుసగా 4 రోజుల గ్యాప్ లభిస్తుంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఇలాంటి సుదీర్ఘ సెలవు దొరకడం వల్ల మీకు సమీపంలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు.
సంక్రాంతి పండగ వచ్చే జనవరి 13 లేదా 14 నుంచి 18 వరకు వరుసగా సెలవులు రానున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమతో పండగ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఈ వారం సెలవులను వినియోగించుకోవచ్చు.
జనవరి చివరిలో లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ నెల 26న సోమవారం రిపబ్లిక్ డే వస్తోంది. అంతకన్నా ముందే జనవరి 24, 25 తేదీల్లో శని, ఆదివారాలు ఉన్నాయి. జనవరి 23న శుక్రవారం వసంత పంచమి సెలవు తీసుకుంటే మరో 4 రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలకు జనవరిలో చాలా సెలవులు ఉన్నాయి. ఆదివారాలు, 2వ శనివారం, 4వ శనివారంతో సంక్రాంతి, రిపబ్లిక్ డే సెలవులు కూడా ఉన్నాయి. మొత్తం ఈ జనవరిలో విద్యార్థులకు 10 రోజుల నుంచి 12 రోజుల వరకు సెలవులు ఉంటాయి. పరీక్షల కన్నా ముందే విద్యార్థులు ఈ సమయాన్ని హాయిగా గడిపేయొచ్చు.
ఒకే నెలలో వరుస సెలవులతో పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులతో భారీగా రద్దీ ఉండొచ్చు. ముందుగానే హోటల్ బుకింగ్స్, రైలు, విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. వచ్చే జనవరి నెలలో హాలిడేస్ ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..
ఇక దూర ప్రాంతాలకు వెళ్లే వారంతా ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకోండి. ఇప్పుడే తక్కువ ధరలో లభ్యమవుతున్నాయి. మీరు ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ జనవరిలో ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి హాలిడేస్ మొత్తం ఎంజాయ్ చేసి రావొచ్చు.