RBI Bank Holiday 2026 : మీకు బ్యాంకులో పని ఉందా? వచ్చే జనవరిలో బ్యాంకులకు 16 రోజులు సెలవులు.. ఫుల్ లిస్టు ఇదిగో
RBI Bank Holiday List 2026 : 2026 జనవరిలో బ్యాంకులకు మొత్తం 16 రోజులు సెలవులు ఉన్నాయి. ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవంటే?
RBI Bank Holiday List 2026
RBI Bank Holiday List 2026 : 2025 డిసెంబర్ నెల ముగియబోతోంది. 2026 మొదటి నెల జనవరి ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరం మొదటి నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ బ్యాంకులకు అనేక సెలవులను ప్రకటించింది.
ఈ నెలలో మొత్తం 16 రోజులు బ్యాంకులు పనిచేయవు. వివిధ కారణాల వల్ల వివిధ నగరాల్లోని బ్యాంకులు మూతపడి ఉంటాయి. జనవరిలో ఏయే రోజులు ఏయే కారణాల వల్ల బ్యాంకులు మూతపడనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మీకు కొత్త ఏడాదిలో బ్యాంకులో పని ఉందా? అయితే, మీ నగరంలో ఏదైనా రోజున బ్యాంకుకు వెళ్లాలనుకుంటే ముందుగా ఆర్బీఐ బ్యాంకు సెలవుల జాబితాను తప్పకుండా చెక్ చేయండి.
జనవరిలో బ్యాంక్ సెలవుల జాబితా :
వచ్చే జనవరిలో బ్యాంకులు ఆదివారాల్లో 4 రోజులు, రెండవ నాల్గవ శనివారాల్లో 2 రోజులు మూతపడతాయి. మిగిలిన 10 సెలవులు వివిధ నగరాలు, రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల మూతపడతాయి. మొత్తంగా 16 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
జనవరి 1వ తేదీన బ్యాంకులకు సెలవు : ఐజ్వాల్, చెన్నై, గ్యాంగ్‌టాక్, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా షిల్లాంగ్‌లలో జనవరి 1వ తేదీన బ్యాంకులు మూతపడతాయి. ఈ రోజున నూతన సంవత్సర దినోత్సవం గాన్-నగై సందర్భంగా బ్యాంకులు మూతపడతాయి.
జనవరి 2వ తేదీన బ్యాంకులకు సెలవు : నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, కొచ్చి తిరువనంతపురంలో జనవరి 2వ తేదీన బ్యాంకులు మూతపడతాయి.
జనవరి 3వ తేదీన బ్యాంకులకు సెలవు : ఈ తేదీన లక్నో నగరంలో మాత్రమే బ్యాంకులు మూతపడతాయి. హజ్రత్ అలీ పుట్టినరోజు సందర్భంగా లక్నోలోని బ్యాంకులు పనిచేయవు.
జనవరి 12వ తేదీన బ్యాంకులకు సెలవు : స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా కోల్‌కతాలో జనవరి 12వ తేదీన బ్యాంకులు పనిచేయవు.
జనవరి 14వ తేదీన బ్యాంకులకు సెలవు : జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి, మాఘ బిహు సందర్భంగా అహ్మదాబాద్, భువనేశ్వర్, గౌహతి ఇటానగర్‌లలో బ్యాంకులు మూతపడతాయి.
జనవరి 15 బ్యాంకులకు సెలవు : ఉత్తరాయణ పుణ్యకాల్/పొంగల్/మాఘే సంక్రాంతి/మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 15న బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో బ్యాంకులు మూతపడతాయి.
జనవరి 16 బ్యాంకులకు సెలవు : తిరువల్లువర్ దినోత్సవం సందర్భంగా జనవరి 16న చెన్నైలో బ్యాంకులు పనిచేయవు.
జనవరి 17న బ్యాంకులకు సెలవు : ఉళవర్ తిరునాల్ కారణంగా జనవరి 17న చెన్నైలో బ్యాంకులు మూతపడతాయి.
జనవరి 23న బ్యాంకులకు సెలవు : నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు,సరస్వతీ పూజ,వీర్ సురేంద్రసాయి జయంతి,బసంత్ పంచమి కారణంగా జనవరి 23న అగర్తల, భువనేశ్వర్ కోల్‌కతాలో బ్యాంకులు పనిచేయవు.
జనవరి 26న బ్యాంకులకు సెలవు : గణతంత్ర దినోత్సవం కారణంగా జనవరి 26న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి.
