New Rules 2026 : బిగ్ అలర్ట్.. 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే.. పాన్-ఆధార్ నుంచి LPG గ్యాస్ వరకు కొత్త రూల్స్..!
New Rules 2026 : బిగ్ అలర్ట్.. జనవరి 1, 2026 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పాన్-ఆధార్ లింకేజ్ నుంచి జీతాలు, సవరించిన ఎఫ్‌డీ రేట్ల వరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Rules 2026
New Rules 2026 : 2025 ముగుస్తోంది. కొత్త ఏడాది 2026లోకి మరికొద్ది రోజుల్లో అడుగుపెట్టబోతున్నాం.. కొత్త సంవత్సరం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జనవరి 1, 2016 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఉన్న అనేక రూల్స్, జీతాలు పొందే ఉద్యోగులు, రైతులు, FD రేట్లపై కొత్త విధానాలు, ఆధార్-పాన్ లింకింగ్, 8వ వేతన సంఘం, పీఎం కిసాన్ ఐడీలు, యువతకు సంబంధించి అన్నింటిపై భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుని జేబుకు చిల్లు పడే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ ఏయే రంగాల్లో ఈ కొత్త నిబంధలు అమల్లోకి రానున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బ్యాంకింగ్ రంగం :
కొత్త ఏడాది నుంచి అనేక బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు వస్తాయి. క్రెడిట్ స్కోర్ ఏజెన్సీలు ప్రతి 15 రోజులకు ఒకసారి కాకుండా ప్రతి వారం క్రెడిట్ డేటాను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. రుణదాతలు తమ రుణగ్రహీతలను అంచనా వేసేందుకు క్రెడిట్ హిస్టరీలను పరిశీలించనున్నారు.
SBI, PNB, HDFC సహా బ్యాంకులు తమ రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి. కొత్త సంవత్సరంలో రుణగ్రహీతలకు ఈఎంఐలు భారీగా తగ్గుతాయని భావిస్తున్నారు. సవరించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు కూడా జనవరి 2016 నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంకులు పాన్ ఆధార్ లింకింగ్‌తో పాటు UPI డిజిటల్ పేమెంట్లకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేశాయి.
జనవరి 1 నుంచి చాలా బ్యాంకింగ్ ప్రభుత్వ సేవలను పొందటానికి పాన్-ఆధార్ లింకింగ్ తప్పనిసరి. లింకింగ్ లేకుండా బ్యాంకింగ్ ప్రభుత్వ సేవలు నిలిపివేయొచ్చు. మోసం దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సిమ్ వెరిఫికేషన్ కూడా కఠినతరం చేశారు.
సోషల్ మీడియా, ట్రాఫిక్ ఆంక్షలు :
ఆస్ట్రేలియా, మలేషియాలోని నిబంధనల మాదిరిగానే 16 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా రూల్స్ కఠినతరం చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వయస్సు ఆధారిత పరిమితులు, తల్లిదండ్రుల నియంత్రణ వంటి చర్చలు జరుగుతున్నాయి. అనేక నగరాలు డీజిల్, పెట్రోల్, కమర్షియల్ వాహనాల ప్రవేశాన్ని పరిమితం చేయనున్నాయి. ఢిల్లీ నోయిడాలో, కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్ వాహనాలను ఉపయోగించి డెలివరీ చేయనున్నారు.
8వేతన సంఘం :
డిసెంబర్ 31తో 7వ వేతన సంఘం ముగియనుంది. జనవరి 1 నుంచి కొత్త 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డియర్‌నెస్ అలవెన్స్ పెరుగుదల కనిపించవచ్చు. నిరంతర ద్రవ్యోల్బణం మధ్య జీతాలు పెరగనున్నాయి. హర్యానాతో సహా కొన్ని రాష్ట్రాలు కూడా పార్ట్‌టైమ్ రోజువారీ వేతన కార్మికులకు కనీస వేతనాలను రివ్యూ చేసి పెంచాలని భావిస్తున్నాయి.
రైతులకు స్పెషల్ ఐడీలు :
ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతులకు పీఎం కిసాన్ పథకం కింద వాయిదాలు పొందడానికి స్పెషల్ ఐడీ జారీ అవుతుంది. ఈ స్పెషల్ ఐడీలు లేకుండా లబ్ధిదారులు డిపాజిట్ చేసిన రూ. 2వేలను పొందలేరు. ప్రధానమంత్రి పంట బీమా పథకం కింద అడవి జంతువుల ప్రదాతల వల్ల పంట నష్టానికి రైతులకు పరిహారం చెల్లిస్తుంది. 72 గంటల్లోపు జరిగిన నష్టాన్ని నివేదిస్తే కచ్చితంగా పరిహారం అందుతుంది.
ముందుగానే నింపిన బ్యాంకింగ్ ఖర్చు వివరాలతో కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్‌ను ప్రవేశపెట్టవచ్చు. జనవరి 1న ఎల్‌పీజీ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా సవరించనున్నారు. విమాన ఇంధన ధరలు కూడా మారొచ్చు. విమాన టిక్కెట్ల ధరలపై ప్రభావం పడొచ్చు.
