JNV Selection Test: జవహర్ నవోదయ విద్యాలయ (JNV) విద్యాసంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులకు మరో రెండు రోజులే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జవర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2026 దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో 15, తెలంగాణలో తొమ్మిది నవోదయ విద్యా సంస్థలు ఉన్నాయి.
అర్హులు ఎవరు..? దరఖాస్తు విధానం ఇలా..
♦ ఆన్‌లైన్‌లో జేఎన్వీ అధికారిక వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
♦ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ప్రతీయేడాది లాగానే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
♦ దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు 01-05-2014 నుంచి 31-07-2016 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.
♦ ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి.
♦ 2025-26 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదివి ఉండాలి.
♦ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75శాతం సీట్లు కేటాయించారు. వారు 3,4,5, తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.
♦ జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.
♦ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు (మెంటల్ ఎబిలిటీ, అరిథ్‌మెరిట్, లాంగ్వేజ్) ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు రెండు గంటల సమయంలో ప్రవేశ పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది.
♦ ఎంపికైన విద్యార్థులు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలురు, బాలికలకు వేరువేరుగా హాస్టల్స్, వసతి సౌకర్యాలు కల్పిస్తారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
♦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-08-2025
♦ ప్రవేశ పరీక్ష తేదీ : 13-12-2025.
♦ పరీక్ష సమయం: తెలుగు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13న ఉదయం 11.30 గంటలకు పరీక్ష ఉంటుంది.
♦ ఫలితాలు : 2026 మార్చి నెలలో