JEE Advanced : 2 లక్షల 45వేల మందికి అవకాశం

IITల్లోని Btech కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే JEE అడ్వాన్స్డ్‌కు ఈసారి 2 లక్షల 45వేల మందికి అవకాశం కల్పించనున్నారు.

  • Publish Date - April 12, 2019 / 03:47 AM IST

IITల్లోని Btech కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే JEE అడ్వాన్స్డ్‌కు ఈసారి 2 లక్షల 45వేల మందికి అవకాశం కల్పించనున్నారు.

IITల్లోని Btech కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే JEE అడ్వాన్స్డ్‌కు ఈసారి 2 లక్షల 45వేల మందికి అవకాశం కల్పించనున్నారు. ఇందుకు జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు నిర్ణయిస్తారు. ఈ మేరకు ఐఐటీ రూర్కీ ఏప్రిల్ 11వ తేదీ గురువారం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అడ్వాన్స్డ్ పరీక్ష జరుగనుంది. కనీస అర్హత మార్కులు సాధించిన వారు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి వీలవుతుంది.
Read Also : చెక్ చేసుకోండి : ఏపీ ఇంటర్ ఫలితాలు

గత ఏడాది మొత్తం 2.24 లక్షల మందికి అవకాశం కల్పిస్తామని ముందుగా ప్రకటించారు. సమాన మార్కుల కారణంగా కొందరికి ఒకే ర్యాంకు రావడంతో చివరికి ఆ సంఖ్య 2,31,024కి చేరింది. ఈసారి బాలికలకు 14 % నుండి 17 % శాతానికి సూపర్ న్యూమరీ సీట్లు కేటాయించనుండడం..ఆర్థికంగా బలహీన వర్గాలుకు 10 %రిజర్వేషన్ అమలు కానుండడం 2018 విద్యాసంవత్సరం కంటే సీట్ల సంఖ్య బాగా పెరగనుంది. 

జేఈఈ మెయిన్ రెండోసారి పరీక్షలు ఏప్రిల్ 12వ తేదీతో ముగియనున్నాయి. ఫలితాలను ఏప్రిల్ 30న ప్రకటిస్తామని జాతీయ పరీక్షల సంస్థ వెల్లడించింది. ముందే రిజల్ట్స్ వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో అర్హత మార్కులు సాధించిన వారు జేఈఈ అడ్వాన్డ్స్‌కు మే 3 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం మే 3 ఉదయం 10 నుంచి
రిజిస్ట్రేషన్ ముగింపు మే 9 సాయంత్రం 5 వరకు
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు మే 10 సాయంత్రం 5 వరకు 
తుది గడువు / హాల్ టికెట్ల డౌన్ లోడ్ మే 20 నుండి 27 వరకు ఉదయం 9 వరకు
పరీక్ష తేదీ మే 27 (రెండు పేపర్లు)
కీ జూన్ 4, ఉదయం 10 గంటలకు 

పరీక్షా కేంద్రాలు
తెలంగాణ : – హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, ఖమ్మం.
ఏపీ : –  అనంతపురం విజయనగరం, ఏలూరు, విశాఖపట్టణం, గుంటూరు, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, తిరుపతి.
Read Also : బద్దకించిన నగరవాసులు : హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్