JEE Advanced 2025 Registrations
JEE Advanced 2025 Registrations : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23, 2025న ప్రారంభించనుంది. అడ్వాన్స్‌డ్ జేఈఈ మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. జేఈఈ అప్లికేషన్ కోసం ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అవుతుంది. జేఈఈ ప్రవేశ పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకోవడానికి చివరి తేదీ మే 2, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
జేఈఈ అభ్యర్థులు మే 5, 2025 నాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసి పేమెంట్ చేయవచ్చు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 3,200 ఉంటుంది. మహిళా అభ్యర్థులకు ఫీజు రూ.1,600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు కూడా రూ.1,600 చెల్లించాలి. ఒకసారి చెల్లించిన రిజిస్ట్రేషన్ రుసుము తిరిగి చెల్లించరని గమనించాలి.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా :
అడ్మిట్ కార్డ్‌లు మే 11 నుంచి మే 18, 2025 వరకు డౌన్‌లోడ్ చేసేందుకు అందుబాటులో ఉంటాయి. అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థి పేరు, జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2025 కోసం రోల్ నంబర్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, పుట్టిన తేదీ, కేటగిరీ, అడ్రస్ వంటి వివరాలు ఉంటాయి.
జేఈఈ ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో మాత్రమే నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం రెండు పేపర్లను కలిగి ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2, ఒక్కొక్కటి మూడు గంటల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరుకావడం తప్పనిసరి. ప్రతి ప్రశ్నాపత్రం 3 వేర్వేరు సెక్షన్లను కలిగి ఉంటుంది. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉంటాయి.
ఐఐటీ కాన్పూర్ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఆర్గనైజింగ్ ఇన్‌స్టిట్యూట్.. ఇంజనీరింగ్, సైన్సెస్ లేదా ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ లేదా బ్యాచిలర్-మాస్టర్ డ్యూయల్ డిగ్రీలు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఐఐటీలో ప్రవేశాన్ని అందించేందుకు జేఈఈ (అడ్వాన్స్‌డ్) పరీక్షను నిర్వహిస్తుంది.
Read Also : Arvind Kejriwal : దళిత విద్యార్థుల ఉన్నత విద్య కోసం డాక్టర్ అంబేద్కర్ స్కాలర్‌షిప్.. కేజ్రీవాల్ ప్రకటన!