JNTU Spot Admissions: విద్యార్థులకు అలెర్ట్.. జేయెన్టీయూలో ఇంజినీరింగ్ స్పాట్ అడ్మిషన్లు.. షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం చూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్(JNTU Spot Admissions). ఇప్పటికే అధికారిక కౌన్సిలింగ్ పూర్తవగా ప్రస్తుతం

JNTU spot admission Schedule released for engineering seats

JNTU Spot Admissions: ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం చూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇప్పటికే అధికారిక కౌన్సిలింగ్ పూర్తవగా ప్రస్తుతం స్పాట్ అడ్మిషన్స్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ (JNTU Spot Admissions), దాని అనుబంధ కాలేజీలలో మిగిలిన ఇంజినీరింగ్ సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లు ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియ ఆగస్టు 26 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబందించిన షెడ్యూల్ కూడా విడుదల అయ్యింది.

GATE 2026: గేట్​ 2026 అప్డేట్.. రిజిస్ట్రేషన్స్ షెడ్యూల్ విడుదల.. ఫీజ్, ఎగ్జామ్ డేట్స్, ఫుల్ డీటెయిల్స్

స్పాట్ అడ్మిషన్ సెంటర్స్, షెడ్యూల్స్:

  • ఆగస్టు 26: వర్సిటీ క్యాంపస్, సుల్తాన్‌పూర్.
  • ఆగస్టు 28: మంథని, జగిత్యాల.
  • ఆగస్టు 29: సిరిసిల్ల, వనపర్తి, మహబూబాబాద్, పాలేరు.

అయితే స్పాట్ అడ్మిషన్స్ లో సీట్లు పొందడానికి హాజరయ్యే విద్యార్థులు అవసరమైన డాక్యుమెంట్స్ తప్పకుండా తీసుకురావాల్సి ఉంటుంది. ఈ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ విధానంలో జరుగుతుంది.