JNTUH New Syllabus : జేన్టీయూహెచ్‌ లో కొత్త సిలబస్..రెండు వారాల్లో అమల్లోకి

జేన్టీయూహెచ్‌ లో కొత్త సిలబస్ ప్రవేశపెట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జేఎన్టీయూ కూకట్‌పల్లి, సుల్తాన్‌పూర్‌లో కొత్తగా బీటెక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త సిలబస్‌ రెండు వారాల్లో అమల్లోకి వస్తుందని తెలిపారు.

JNTUH new syllabus

JNTUH new syllabus : జేన్టీయూహెచ్‌ లో కొత్త సిలబస్ ప్రవేశపెట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జేఎన్టీయూ కూకట్‌పల్లి, సుల్తాన్‌పూర్‌లో కొత్తగా బీటెక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త సిలబస్‌ రెండు వారాల్లో అమల్లోకి వస్తుందని తెలిపారు. ఏడాది ఫీజు రూ.1లక్షగా నిర్ణయించామని చెప్పారు.

ఈ ఏడాది వనపర్తిలో కొత్తగా ఆరు కోర్సులతో ఇంజినీరింగ్‌ కాలేజీని ప్రారంభించామని వెల్లడించారు. ఈ కాలేజీకి 45 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. మార్కెట్‌, పరిశ్రమ అవసరాల మేరకు కోర్సులను ఆధునికీకరించడంలో భాగంగా పలు కోర్సుల సిలబస్‌ను సమూలంగా మార్చినట్లు వీసీ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. బీటెక్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల సిలబస్‌ను సమూలంగా మార్చామని పేర్కొన్నారు.

Border Roads Organization : రక్షణశాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీ నియామకానికి రాష్ట్రాన్ని 20 క్లస్టర్స్‌గా విభజించి ఎంపిక ప్రకియ చేపట్టామని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరంలో డిపార్ట్‌మెంట్‌కు 1+2+4 రేషియోలో ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అధ్యాపకులు ఉండేలా చర్యలు తీసుకుంటామని వీసీ కట్టా నర్సింహారెడ్డి పేర్కొన్నారు.