Border Roads Organization : రక్షణశాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఈ నోటిఫికేషన్ ద్వారా 246 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.

Border Roads Organization : రక్షణశాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Border Roads Organization

Updated On : August 12, 2022 / 8:20 PM IST

Border Roads Organization : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 246 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.

ఖాళీల వివరాలు పరిశీలిస్తే డ్రాఫ్ట్ మ్యాన్ పోస్టులు14, సూపర్‌వైజర్ పోస్టులు 7,సూపర్‌వైజర్ సైఫర్ పోస్టులు 13, సూపర్‌వైజర్ దుకాణాలు పోస్టులు 9, హిందీ టైపిస్ట్ పోస్టులు 10,ఆపరేటర్ (కమ్యూనికేషన్) పోస్టులు 35, ఎలక్ట్రీషియన్ పోస్టులు 30, వెల్డర్ పోస్టులు 24,మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులు 22,మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులు 82, ఉన్నాయి. అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bro.gov.in/ పరిశీలించగలరు.