నవోదయ విద్యాలయాలు..నాణ్యమైన విద్య..సంస్కృతి ఉండడం..సంప్రదాయలను పెంపొందించడం..ఇలా ఎన్నో..ఉంటాయి..అందుకే ఈ విద్యాలయాల్లో ప్రవేశం అంటే డిమాండ్ బాగానే ఉంటుంది. ఒక్కో నవోదయ పాఠశాలలో 80 సీట్లుంటాయి. అందులో 75 శాతం సీట్లు అంటే 60 సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎగ్జామ్ టెస్ట్ ‘ఉగాది’ పండుగ రోజున నిర్వహించడం వివాదానికి కారణమౌతోంది.
పండుగ సంబరాలు జరుపుకోకుండా పరీక్షా కేంద్రాలకు తరలి రావాలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇన్విజిలేటర్లకు..టీచర్లకు కూడా ఇబ్బందులు తప్పవు. అందుకే పరీక్ష డేట్‌ని మార్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. నవోదయ పరీక్ష దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఏప్రిల్ 06వ తేదీ జరుగనుంది. అదే రోజున ఉగాది ఫెస్టివల్. ఇక్కడ కేంద్ర సెలవుల్లో ఉగాది పండుగ ఉండదు. మొదట్లోనే తెలుగు రాష్ట్రాల అధికారులు స్పందిస్తే పరీక్షా తేదీలో మార్పు చేసే ఛాన్స్ ఉండేదనే పలువురు పేర్కొంటున్నారు. మరి ఎగ్జామ్ డేట్ మారుస్తారా ? లేదా ? అనేది చూడాలి.
పరీక్ష విధానం :
– మొత్తం 80 ప్రశ్నలుంటాయి.
– 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
– పరీక్షలో మూడు సెక్షన్లు.
– సెక్షన్ – 1లో మెంటల్ ఎబిలిటీ (40 ప్రశ్నలకు 50 మార్కులు).
– సెక్షన్ – 2లో అరిథ్‌మెటిక్ (20 ప్రశ్నలకు 25 మార్కులు)
– సెక్షన్ – 3లో లాంగ్వేజీ (20 ప్రశ్నలకు 25 మార్కులు).
– పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది.
– సెక్షన్ -1 కు 60 నిమిషాలు
– సెక్షన్ – 2కు 30 నిమిషాలు
– సెక్షన్ – 3కు 30 నిమిషాలు.
– పరీక్ష తేది: 06.04.2019.