Job Mela: గుడ్ న్యూస్ మీకోసమే.. 525 పోస్టులు, అద్భుతమైన అవకాశం.. అస్సలు మిస్ అవకండి

Job Mela: జాబ్ మేళాల వల్ల ఇప్పటికే కొన్ని లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకున్నారు.

Job fair at Government Degree College in Avanigadda, Krishna district

నిరుద్యోగుల కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వ, ప్రవైట్ సంస్థలు జాబ్ మేళాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఈ జాబ్ మేళాల వల్ల ఇప్పటికే కొన్ని లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకున్నారు. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 6వ తేదీన మరో భారీ జాబ్ మేళా జరుగనుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 525 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. మరిన్ని వివరాల కోసం 7995534572, 6300618985 నంబర్లను సంప్రదించవచ్చు.

ఉద్యోగం, ఖాళీల వివరాలు:

  • మొహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్ ఖాళీలు 50
  • శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఖాళీలు 20
  • స్విగ్గీ ఖాళీలు 100
  • పేటీఎం ఖాళీలు 50
  • వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాళీలు 60
  • కురాకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాళీలు 40
  • మెడప్లస్ ఫార్మసీ ఖాళీలు 50
  • బంధన్ బ్యాంక్ లిమిటెడ్ ఖాళీలు 20
  • హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాళీలు 35
  • హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ ఖాళీలు 100