Job fair in Kancharapalem, Visakhapatnam district
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆగస్టు 1న విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలోని పాత ఐటీఐ జంక్షన్ సమీపంలో ఉన్న ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి ఆఫీస్ లో జాబ్ మేళా జరుగనుంది. ఈ ఉద్యోగ మేళాలో ముత్తూట్ ఫైనాన్స్, ఇన్నోవ్‌సోర్సెస్ సర్వీసెస్, జస్ట్ డయల్ లాంటి ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. కాబట్టి.. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ జాబ్ మేళా గురించి మరిన్ని వివరాల కోసం 9959377669 నంబర్ ని సంప్రదించవచ్చు.