Site icon 10TV Telugu

Job Mela: టెన్త్ అర్హతతో సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్.. ఖుషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ లో అవకాశాలు.. పూర్తి వివరాలు మీకోసం

Job fair in Peddapalli under the auspices of Khushi Vigyan Fertilizer

Job fair in Peddapalli under the auspices of Khushi Vigyan Fertilizer

టెన్త్, ఆపై చదువులు పూర్తి చేసుకున్న వారికి గుడ్ న్యూస్. పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లాలోని ఖుషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ లో ఖాళీగా ఉన్న 67 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన అధికారి వై. తిరుపతి అధికారిక ప్రకటన చేశాడు. జులై 24న సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రూమ్ నెంబర్ 225లో ఈ జాబ్ మేళా జరుగనుందని తెలిపారు. కాబట్టి, నిరుద్యోగులు తప్పకుండా ఈ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఉద్యోగ వివరాలు:
సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 60, ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ పోస్టులు 4, హెచ్ ఆర్ మేనేజర్ [పోస్టులు 2, ఆఫీస్ బాయ్ పోస్టు 1.

విద్యార్హతలు:
అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:
ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

అవసరమయ్యే ధ్రువపత్రాలు:
విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్, ఆధార్ కార్డు జొరాక్స్, పాన్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ ఫొటో తీసుకొని రావాల్సి ఉంటుంది.

మరిన్ని సందేహాల కోసం 8121262441, 9391420932, 8985336947 నంబర్లను సంప్రదించవచ్చు.

Exit mobile version