Job Mela: టెన్త్ అర్హతతో సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్.. ఖుషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ లో అవకాశాలు.. పూర్తి వివరాలు మీకోసం

Job Mela: పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లాలోని ఖుషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ లో ఖాళీగా ఉన్న 67 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు.

Job Mela: టెన్త్ అర్హతతో సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్.. ఖుషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ లో అవకాశాలు.. పూర్తి వివరాలు మీకోసం

Job fair in Peddapalli under the auspices of Khushi Vigyan Fertilizer

Updated On : July 22, 2025 / 11:51 AM IST

టెన్త్, ఆపై చదువులు పూర్తి చేసుకున్న వారికి గుడ్ న్యూస్. పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లాలోని ఖుషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ లో ఖాళీగా ఉన్న 67 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన అధికారి వై. తిరుపతి అధికారిక ప్రకటన చేశాడు. జులై 24న సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రూమ్ నెంబర్ 225లో ఈ జాబ్ మేళా జరుగనుందని తెలిపారు. కాబట్టి, నిరుద్యోగులు తప్పకుండా ఈ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఉద్యోగ వివరాలు:
సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 60, ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ పోస్టులు 4, హెచ్ ఆర్ మేనేజర్ [పోస్టులు 2, ఆఫీస్ బాయ్ పోస్టు 1.

విద్యార్హతలు:
అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:
ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

అవసరమయ్యే ధ్రువపత్రాలు:
విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్, ఆధార్ కార్డు జొరాక్స్, పాన్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ ఫొటో తీసుకొని రావాల్సి ఉంటుంది.

మరిన్ని సందేహాల కోసం 8121262441, 9391420932, 8985336947 నంబర్లను సంప్రదించవచ్చు.