Job Mela in warangal
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు చాలా కష్టపడుతున్నాయి. అందుకోసం జిల్లాల వారీగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ లక్షల మందికి ఉంద్యోగాలు కలిపిస్తున్నాయి. అదేవిదంగా ప్రైవేట్ కంపెనీలు సైతం ముందుకొచ్చి జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. ఇందులో భాగాంగే తాజాగా వరంగల్ జిల్లాలో మరో జాబ్ మేళా జరుగనుంది. ఈమేరకు వరంగల్ జిల్లా ఉపాధి కల్పనాధికారి రజిత తెలిపారు. ఈ నెల (జులై 16) 16న మ్యాజిక్ బస్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ లో భాగంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, యువత తప్పకుండా ఈ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక ఈ జాబ్ మేళాలో హెచ్ఆర్ఎస్ నెక్స్ట్, డిమార్ట్, ఫ్లిప్ కార్ట్, బిగ్ సి, సాంసంగ్, క్వెస్ క్రాప్, హెచ్డిబి ఫైనాన్స్ లాంటి చాలా కపెనీలు పాల్గొంటున్నాయి.
వయోపరిమితి:
ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
విద్యార్హత:
ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఆపై చదివిన అభ్యర్థులు అందరు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
అవసరమయ్యే ధ్రువపత్రాలు:
విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, బయోడేటా, ఆధార్ కార్డ్, రెండు పాస్ ఫోటోలు తీసుకొని జాబ్ మేళాలో పాల్గొనాలి.
ఎంపిక విధానం:
అభ్యర్థులను ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
జాబ్ మేళా వేదిక:
వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు ప్రాంతంలోని జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈ జాబ్ మేళా జరుగుతుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు కొనసాగుతుంది.