Job fair at Andhra University
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, నేషన్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా జరుగనుంది. ఈ మేరకు యుఈఐజీబీ డిప్యూటీ చీఫ్ కె. దొరబాబు అధికారిక ప్రకటన చేశారు. జులై 2న ఈ జాబ్ మేళా మొదలుకానుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ప్రముఖ కంపెనీలు దాదాపు 300 పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. కాబట్టి అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తప్పకుండ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
విద్యార్హత: టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఐటీఐ, డిప్లొమా, బి/డి/ఎం ఫార్మసీ పూర్తి చేసిన వారంతా ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు.
వయోపరిమితి: దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉండాలి.
వేతనవివరాలు: ఎంపికైన అభ్యర్థులకు అర్హతల ఆధారంగా రూ.10వేల నుంచి రూ.30 వేల వేతనం అందుతుంది.
ఉద్యోగ ప్రాంతాలు: విశాఖ, విజయనగరం, అనకాపల్లి, తుని ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్స్ https://www.ncs.gov.in, https://employment.ap.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఇంకా ఏమైనా సందేహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 0891-284484 సంప్రదించాలని తెలిపారు.